వాచ్ లుక్‌ల గురించి పూర్తి వివరాలు

స్మార్ట్‌వాచ్‌ను కలిగి ఉండటంలో చాలా సరదాగా అనిపించే విషయం ఏమిటంటే, మీరు చిటికేస్తే ముందుండే లెక్కలేనన్ని వాచ్ లుక్‌లు. ఎంచుకోవడానికి బోలెడన్ని ఉంటాయి కాబట్టి, వాటిని ఎలా కనుగొనాలో, అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. మీ అన్వేషణలో సహాయపడటానికి, కొన్ని వాచ్ లుక్ ఆవశ్యకతలను వివరంగా మీముందు ఉంచుతున్నాము.

నా దగ్గర ఇప్పటికే వాచ్ లుక్ లేదా?

మీ వాచ్ లుక్‌ను మీ పరికరం మొదటి స్క్రీన్‌గా భావించండి. మీ వాచ్, బాక్స్ వెలుపల స్టాండర్డ్ లుక్‌తో వచ్చినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్‌లు క్రీడలు మొదలుకొని, కళ వరకు, క్లాసిక్ టైమ్‌పీస్‌ల వరకు ప్రతి దాని నుండి ప్రేరణ పొందిన అంతు లేనన్ని లుక్‌ల సమాహారాలను క్రియేట్ చేసి మీ ముందుంచారు.

అవి నాకు ఎక్కడ దొరుకుతాయి?

మీరు యాప్‌ల విభాగంలో ఉన్నారని నిర్ధారించుకొని, మీ ఫోన్‌లో Playని తెరవండి. సెర్చ్ బార్ కింద ఉన్న "కేటగిరీలు" ట్యాబ్‌కు కుడి వైపునకు స్క్రోల్ చేయండి, ఆపై "వాచ్ లుక్‌లు"ను ట్యాప్ చేసి ఎంచుకోండి. అక్కడ, మీరు మినిమలిస్ట్, ఆర్టిస్టిక్, బొటానికల్, మరిన్నింటితో సహా విభిన్నమైన లుక్‌ల కలెక్షన్‌లను బ్రౌజ్ చేయవచ్చు.

మీరు "ఆధునికమైనవి" లేదా "రాశిచక్రం" వంటి పదాలను ఉపయోగించి కూడా వాచ్ లుక్‌ల కోసం సెర్చ్ చేయవచ్చు; ఆపై సెర్చ్ బార్‌కు దిగువున‌ ఉన్న "ఈ పరికరం" నుండి మీ వాచ్‌కి మారి, వాచ్ లుక్‌ల ఫిల్టర్‌ను వర్తింపజేయవచ్చు. రేటింగ్ ఆధారంగా ఫలితాలను మెరుగుపరచండి; అవి ప్రీమియంకి (పెయిడ్) చెందినవా, లేదా అటువంటి మరెన్నో రకాలను బట్టి.

మీ వాచ్‌లో బ్రౌజ్ చేయాలనుకుంటున్నారా? మీ వాచ్‌లో Playను తెరిచి, భూతద్దాన్ని ట్యాప్ చేయండి. ఆపై మీ క్వెరీలో "వాచ్ లుక్"ను చేర్చండి లేదా సెర్చ్ బార్ కింద ఉన్న వాచ్ లుక్‌లు"ను ట్యాప్ చేయండి. మీరు ఎంపిక చేసుకున్న తర్వాత, దాన్ని నేరుగా మీ వాచ్‌కి డౌన్‌లోడ్ చేసుకోండి.

నేను వాచ్ లుక్‌లను ఎలా మార్చగలను?

మీరు మీ వాచ్‌లో బోలెడన్ని రకరకాల లుక్‌లను స్టోర్ చేయవచ్చు, వాటి మధ్య సులభంగా స్వాప్ చేయవచ్చు. మీ ప్రస్తుత వాచ్ లుక్‌పై ఎక్కువసేపు నొక్కి ఉంచితే అది మిమ్మల్ని మీరు ఇటీవల ఉపయోగించిన లుక్‌ల కలెక్షన్‌కు తీసుకొస్తుంది (మీ లుక్‌లు అన్నిటినీ యాక్సెస్ చేయడానికి ప్లస్ గుర్తును ట్యాప్ చేయండి). మీ లుక్‌ల గుండా స్క్రోల్ చేయండి, మీ మూడ్‌కి తగినట్టుగా ఉన్న లుక్‌ను ట్యాప్ చేయండి.

ప్రత్యామ్నాయంగా, మీ వాచ్‌లోని పెయిర్ చేసిన ఫోన్ యాప్‌ను ఉపయోగించండి, ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసిన లుక్‌లను చూడవచ్చు, అలాగే మీరు దేన్ని ధరించాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు.

నేను దానిని అనుకూలంగా మార్చుకోవచ్చా?

అనేక వాచ్ లుక్‌లు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీ వాచ్ సహాయక యాప్ నుండి, వాచ్ లుక్‌ల విభాగానికి వెళ్లి, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న లుక్‌ను ట్యాప్ చేయండి. లుక్‌ను బట్టి, మీరు రంగు, నంబర్‌ల డిజైన్ వంటి వాటిని సర్దుబాటు చేయవచ్చు. రోజువారీ అడుగుల సంఖ్య, గుండె స్పందన రేటు, తేదీ, మరిన్నిటితో సహా ఏయే కాంప్లికేషన్‌లను డిస్‌ప్లే చేయాలో కూడా మీరు ఎంచుకోవచ్చు.

మీ లుక్‌ను నేరుగా మీ వాచ్ నుండే మార్చడానికి, వాచ్ లుక్‌పై ఎక్కువసేపు నొక్కి ఉంచి, ఆపై సెట్టింగ్‌ల చిహ్నాన్ని లేదా “అనుకూలంగా మార్చండి” ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. అక్కడి నుండి, మీకు నచ్చిన విధంగా లుక్‌ను సర్దుబాటు చేయడం సులభం.
వాచ్ లుక్‌లు కేవలం ఫ్యాషన్ ఎంపికకు పరిమితమైనవి కాదు. అవి సీజన్ వేడుక జరుపుకోవడానికి, మనసైన ఫోటోలను ధరించడానికి, మీ వ్యక్తిగత డేటాను చెక్ ఇన్ చేయడానికి ఒక మార్గం కాగలవు. ఇప్పుడు మీరు ప్రాథమిక అంశాలను తెలుసుకున్నారు, ఇక ముందుకు సాగి మీ ఉత్తమ లుక్‌కు రూపమివ్వండి.